'దిక్సూచి' కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

JN: విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 'దిక్సూచి' అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటర్ వరకు ప్రతీ రోజూ 30 నిమిషాల పాటు ప్రత్యేక పిరియడ్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో విద్య, వ్యక్తిత్వ వికాసం, పౌర నైపుణ్యాలు, ఆరోగ్యం, వంటి విభాగాల్లో ఇది కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.