అత్యధికంగా కుమ్మెరలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం..!
NGKL: గడచిన 24 గంటలలో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెరలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పాలెంలో 33.5, లింగాలలో 22.5, కల్వకుర్తిలో 15.5, బిజినేపల్లిలో 15.0, కొండనాగులలో 13.8, పెద్దముద్దునూరులో 10.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.