జాబ్ మేళాలో ఎంపికైన విద్యార్థులకు అభినందన

జాబ్ మేళాలో ఎంపికైన విద్యార్థులకు అభినందన

NLG: దేవరకొండ ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నల్గొండ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఐదుగురు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమావత్ రవి సోమవారం తెలిపారు. కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. ఎంపికైన ఐదుగురు విద్యార్థులకు ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.