'నేరాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లు'
ADB: విభిన్న నేరాలకు పాల్పడుతూ ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్ల నిజస్వరూపం బట్టబయలు చేసినట్లు ఆదిలాబాద్ DSP జీవన్ రెడ్డి శనివారం తెలిపారు. పట్టణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోసం చేసిన డబ్బులతో ఖరీదైన మొబైల్ ఫోన్, బైకు కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. నకిలీ క్షుద్ర పూజలు చేస్తూ సమస్యలను దూరం చేస్తామని ప్రజలను మోసగించినట్లు పేర్కొన్నారు.