VIDEO: 'భక్తుల భాగస్వామ్యంతో గోవులను రక్షించుకుందాం'

TPT: మన వేదాలు, పురాణాల్లో పేర్కొన్న విధంగా సకల దేవతాస్వరూపాలైన గోవులను భక్తుల భాగస్వామ్యంతో రక్షించుకోవడం ద్వారా భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకుందామని టీటీడీ ఈవో జె.శ్యామల రావు ఉద్ఘాటించారు. ఈ మేరకు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో శనివారం గోకులాష్టమి సందర్బంగా గో పూజ మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు.