తునికిలో నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు

తునికిలో నల్లపోచమ్మకు ప్రత్యేక పూజలు

MDK: కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో స్వయంభుగ వెలిసిన శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని పట్టువస్త్రాలతో అలంకరించి ఒడిబియ్యం సమర్పించారు. నిమ్మకాయల దండ, రంగు రంగుల గాజులతో అలంకరించారు. వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు రావడంతో ఆలయంలో సందడి నెలకొంది.