అతడే మా ఓటమిని శాసించాడు: సూర్యకుమార్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్ ఓటమి పాలైంది. మ్యాచ్ అనంతరం ఓటమిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైనట్లు తెలిపాడు. అలాగే, ఆస్ట్రేలియా బౌలర్ హాజిల్‌వుడ్‌పై ప్రశంసలు కురిపించాడు. పవర్‌ప్లేలో అతడు బౌలింగ్ చేసిన విధానం అద్భుతమని.. కచ్చితంగా జోష్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చాడు.