ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కోరుట్ల విద్యార్థిని

ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన కోరుట్ల విద్యార్థిని

JGL: కోరుట్ల మండలం చర్లకొండాపూర్ గ్రామానికి చెందిన పటేరి రిషికా, ఆదివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. ఆమె సాధించిన ఈ అత్యుత్తమ ఫలితంతో గ్రామానికి గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా రిషికా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేయగా, గ్రామ ప్రజలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.