మానసిక వైద్యశాల సందర్శించిన మంత్రి
VSP: జిల్లాలో రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఇంఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి స్థానిక మానసిక వైద్యశాలను సందర్శించారు. ఆసుపత్రి పరిస్థితులు, సేవలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి, సూపరింటెండెంట్ రామిరెడ్డి పాల్గొన్నారు.