పదవ తరగతి విద్యార్థులకు పంపిణీకి సిద్ధంగా హాల్ టికెట్లు
JGL: పెగడపల్లి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లు వచ్చినట్లు పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలకు చెందిన 94 మంది విద్యార్థులకు ఈనెల 11న హాల్ టికట్లు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఈనెల 14 నుంచి ఏప్రిల్ 14 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.