పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు

ప్రకాశం: ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ ఏఆర్ దామోదర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను సావధానంగా విన్నారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.