నేడు రామలింగేశ్వరుని కల్యాణోత్సవం

నేడు రామలింగేశ్వరుని కల్యాణోత్సవం

BPT: కాపూరులోని శ్రీగంగా పార్వతీసమేత శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గురువారం స్వామివారి శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసబాబు తెలిపారు. గురువారం స్వామి వారికి ప్రత్యక అభిషేకాలు ఉంటాయన్నారు. అనంతరం స్వామివారి కల్యాణోత్సవం ఉంటుందన్నారు. మధ్యాహ్నం నుంచి ఆలయం వద్ద అన్నధానం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు పేర్కొన్నారు.