త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకారం

కృష్ణా: ఉంగుటూరు మండలం వెల్దిపాడు పీఎసీసీలో సోమవారం త్రీమెన్ కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఛైర్‌పర్సన్‌గా నెక్కలపూడి రాజమన్నార్, సభ్యులుగా కొట్నాని శ్రీనివాసరావు, పాతూరి శివరాం నియమితులై కేడీసీసీ మేనేజర్ పఠాన్ షరీబ్ చేత నియామక పత్రాలు అందుకున్నారు. ముఖ్య అతిథి కాసర్నేని రాజా రైతాంగ సంక్షేమం, సంఘాల బలోపేతానికి పాలకవర్గాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.