పోగొట్టుకున్న మొబైల్‌ను బాధితుడికి అందజేసిన ఎస్సై
MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామానికి చెందిన తాటి రాజు కొద్దిరోజుల క్రితం తన సెల్ఫోను పోగొట్టుకున్నాడు. బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు CEIR పోర్టల్ ద్వారా మొబైల్‌ను కనిపెట్టారు. సోమవారం పస్రా పీఎస్‌లో ఎస్సై తాజుద్దీన్ బాధితుడికి మొబైల్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ తదితరులు ఉన్నారు.