రేపు డయల్ యువర్ డిపో మేనేజర్
SRD: నారాయణఖేడ్ RTC డిపోలో రేపు డయల్ యువర్ DM నిర్వహిస్తున్నట్లు ఖేడ్ DM సుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 26 గురువారం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. బస్సు సౌకర్యాలు, సమస్యలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు 9959223170కు కాల్ చేసి తెలియజేయాలని కోరారు.