ఎంజీఎం ఆస్పత్రిలో ప్రైవేట్ దందా
WGL: MGM ఆస్పత్రిలో చికిత్స కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు అవసరమైన అన్ని వైద్య పరీక్షలు ఆస్పత్రిలోనే నిర్వహించాల్సి ఉండగా, అధికారుల నిర్లక్ష్యంతో ప్రైవేట్ ల్యాబ్‌లకు పంపిస్తున్నారని రోగుల బంధువులు ఆరోపించారు. రక్తం, మూత్రం వంటి పరీక్షలు కూడా బయట చేయించుకోవాల్సి రావడంతో ఆర్థిక భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించాలని కోరారు.