మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

JGL: ఎమ్మెల్యే సంజయ్ కుమార్, క్రీడలు పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణంలో వివేకానంద మినీ స్టేడియం మధ్యలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయటం వల్ల మైదానం చిన్నగా మారిందని, జిల్లా స్థాయి క్రీడల సమయంలో ఇబ్బందిగా ఉందని తెలిపారు. జిల్లాకు చల్ గల్ గ్రామంలో ఒక మైదానం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు.