పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు?

పశ్చిమ బెంగాల్‌లో రెండు దశల్లో ఎన్నికలు?

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రెండు దశల్లో జరిగే అవకాశం ఉందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. హింసను అరికట్టడానికి, భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. అధికార టీఎంసీ మినహా మెజారిటీ రాజకీయ పార్టీలు, భద్రతా దళాలు ఒకటి లేదా రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించాలని కోరాయి. శాంతిభద్రతల దృష్ట్యా మహారాష్ట్ర తరహాలో రెండు దశలే ఉత్తమమని ఈసీ భావిస్తోంది.