'తాగునీటి సమస్యను పరిష్కరించండి'

ADB: భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ గ్రామంలో వర్షాకాలంలో సైతం తాగునీటి సమస్యతో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో ఉన్న విద్యుత్ బోర్లు చెడిపోవడంతో నీటి సరఫరా ఆగిపోయిందని గ్రామస్తులు తెలిపారు. మిషన్ భగీరథ నీరు సైతం రావడంలేదని తెలిపారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.