పెండింగ్ కూలీ డబ్బు చెల్లింపు పూర్తి చేశాం: ఏపీఓ

MBNR: ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు రావలసిన ఫిబ్రవరి మార్చ్ పెండింగ్ కూలీ డబ్బులు ప్రభుత్వం ఏప్రిల్‌లో చెల్లించిందని ఏపీవో కురుమయ్య తెలిపారు. గురువారం దావాజ్ పల్లి కుంటలో మట్టి తీసే పనులను ఆయన పరిశీలించి మాట్లాడుతూ.. ఏప్రిల్ నెల కూడా రెండు వారాల డబ్బులు మాత్రమే చెల్లించాల్సి ఉందన్నారు. 28 గ్రామాల్లో 3500 మంది కూలీలు ఈరోజు పని చేశారన్నారు.