VIDEO: తల్లికి వందనం అమలు చేయాలంటూ ఆందోళన

KKD: తల్లికి వందనం పథకం తమకు రాలేదంటూ భారీ ఎత్తున మహిళలు సోమవారం కలెక్టరేట్‌కు పోటెత్తారు. దీంతో వారిని కంట్రోల్ చేయడానికి ఉద్యోగులు నానా ఇబ్బందులు పడ్డారు. ఒక దశలో తోపులాట సైతం చోటుచేసుకుంది. వారి కోసం కలెక్టర్ సన్‌మోహన్ సగిలి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. తమకు తల్లికి వందనం పథకం వచ్చే విధంగా చూడాలని మహిళలు అధికారులను వేడుకున్నారు.