ప్రజా సమస్యలపై నిబద్ధత చాటుకున్న నేత
RR: నందిగామ మండలం చేగూరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీశైలం ప్రజా సమస్యలపై తన నిబద్ధతను చాటుకున్నారు. చేగూరు పెట్రోల్ పంపు నుంచి కోమటి కుంట వరకు మట్టి రోడ్డు దెబ్బ తినడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సొంత నిధులను వెచ్చించి మరమ్మతు పనులు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికులు పడుతున్న ఇబ్బందులకు తన వంతుగా స్పందించానన్నారు.