వెంకటాచల దేవస్థానం పాలకమండలి ప్రమాణ స్వీకారం
NTR: తిరువూరు శ్రీ వెంకటాచల దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారం చేసింది. ఛైర్మన్‌గా పర్వతం శ్రీనివాసరావు, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ ఆర్గానిక్ సర్టిఫికెట్ అథారిటీ ఛైర్మన్ శావల దేవదత్ పాల్గొని నూతన పాలకమండలికి అభినందనలు తెలిపారు. పాలకమండలి సభ్యులుగా వెంకటేశ్వరరావు, వెంకట్రామ్మ, చంద్రశేఖర్, త్రివేణి పాల్గొన్నారు.