నేడు ఎస్సీ కమిషన్ ఛైర్మన్ మన్యం జిల్లా పర్యటన
PPM: రాష్ట్ర షెడ్యుల్డ్ కులాల కమీషన్ ఛైర్మన్ కె.ఎస్.జవహర్ శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గ. వరకు ఐటీడీఎ కమ్యూనిటీ హల్‌లో సంఘం ప్రతినిధులను కలుస్తారు. ఆనంతరం మధ్యహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు జిల్లా అధికారులతో సమావేశంలో పాల్గొంటారు.