ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే 'మీకోసం' కార్యక్రమం
కృష్ణా: మచిలీపట్నం పోలీస్ కార్యాలయంలో సోమవారం 'మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం అన్నారు. ప్రజల నుంచి స్వయంగా 37 అర్జీలను స్వీకరించి, ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు అధికారులు సత్వరమే అర్జీలను పరిష్కరించాలని సూచించారు.