గణేష్ నవరాత్రి ఉత్సవాలపై శాంతి సంఘ సమావేశం

గణేష్ నవరాత్రి ఉత్సవాలపై శాంతి సంఘ సమావేశం

NLG: నల్లగొండ పట్టణంలో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో DSP కె. శివరాం రెడ్డి ఆధ్వర్యంలో శాంతి సంఘ సమావేశం జరిగింది. గణేష్ మండప నిర్వాహకులు శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. డీజేలకు అనుమతి లేదని, వినిపిస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాల ఏర్పాటు, సౌండ్ లిమిట్, అగ్నిప్రమాద నివారణపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.