'పత్తి కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలి'
NRML: పత్తి పంట కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. నిర్మల్ కలెక్టరేట్‌లో పత్తి పంట కొనుగోలు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి పంట కొనుగోలు ప్రక్రియను నిర్ణీత సమయానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలన్నారు.