'ఆటో అడ్డాల ఆక్రమణల తొలగింపునకు వినతి'
MDK: రామాయంపేట మున్సిపాలిటీలోని ఆటో అడ్డాలను ఆక్రమించి చిరు వ్యాపారులు ఇబ్బంది పెడుతున్నారని శ్రీ రామాంజనేయ ఆటో వర్కర్స్ యూనియన్ సభ్యులు సోమవారం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. సిద్దిపేట చౌరస్తాలో సుమారు 200 ఆటోలు నిలుపుతున్నామని, ఆక్రమణల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై ఆక్రమించిన వ్యాపారాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.