కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే వర్ధంతి

కలెక్టరేట్‌లో జ్యోతిరావు పూలే వర్ధంతి

అనకాపల్లి కలెక్టరేట్‌లో శుక్రవారం జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విజయ కృష్ణన్ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి మరువలేమని అన్నారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించేందుకు పాటుపడినట్లు పేర్కొన్నారు. ఆయన చూపిన బాటలో నడవాలన్నారు. డీఆర్‌వో సత్యనారాయణ పాల్గొన్నారు.