కమనీయంగా సాగిన సీతారాముల వారి కళ్యాణం

కమనీయంగా సాగిన సీతారాముల వారి కళ్యాణం

CTR: పుంగనూరు పట్టణం తాటిమాకుల పాళ్యంలో సోమవారం సీతారాముల వారి కళ్యాణం కమనీయంగా సాగింది. ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి మండపంపై కొలువు తీర్చారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య వేద పండితులు సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో కల్యాణాన్ని తిలకించారు.