'700 ఓట్లు తొలగింపుకు నిర్ణయం'
VZM: గజపతినగరం నియోజకవర్గంలో డబుల్ ఎంట్రీ అయిన 700 ఓట్లు తొలగించేందుకు నిర్ణయించినట్లు గజపతినగరం నియోజకవర్గ ఎన్నికల ఓటర్ నమోదు అధికారి ప్రమీలా గాంధీ అన్నారు. గురువారం గజపతినగరం తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. వీటిపై ఏమైనా సందేహాలు ఉంటే తెలపాలన్నారు.