VIDEO: పండుగ పూట.. ధరల దోపిడి

MLG: వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయం వద్ద ఇవాళ మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. ఈ  సందర్భంగా కొబ్బరికాయల ధరలు పెరిగాయి. సాధారణ రోజుల్లో రూ.25కు లభించే కొబ్బరికాయలను కొంతమంది వ్యాపారులు  ఇవాళ రూ.50కు విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అధిక ధరలను నియంత్రించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.