మంగమ్మ తల్లి తిరుణాల ఏర్పాట్లు పరిశీలించిన ఎస్సై

మంగమ్మ తల్లి తిరుణాల ఏర్పాట్లు పరిశీలించిన ఎస్సై

ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని మంగమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా శుక్రవారం మంగపల్లి గ్రామంలో ఎస్సై మాధవరావు పర్యటించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ.. తిరునాళ్ల సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశమున్నందున భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు.