‘మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం'

KDP: పోరుమామిళ్ల మండలంలోని కవలకుంట్ల హైస్కూల్లో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో స్కూల్ ఆవరణంలో మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటి సంరక్షించాలని ఆయన పేర్కొన్నారు. యోగా వల్ల వచ్చే ఉపయోగాలను విద్యార్థులకు వివరించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.