VIDEO: విశాఖలో సందడి చేసిన మూవీ టీమ్
VSP: రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్, టీనా శ్రావ్య జోడీగా, మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' శుక్రవారం విడుదలై హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విశాఖలోని రామాటాకీస్‌లో సినిమాను ప్రేక్షకులతో కలిసి వీక్షించారు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు హీరో తిరువీర్ కృతజ్ఞతలు తెలిపారు.