సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
KKD: సర్పవరం బోటు క్లబ్ ఉద్యానవనంలో నిర్వహించిన అవగాహన సదస్సులో సీఐ బి.పెద్దిరాజు మాట్లాడారు. పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, అనుమానాస్పద లింకులను పంచుకోవద్దని సూచించారు. మోసానికి గురైన వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.