ఆలయంలో తొక్కిసలాట ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

శిర్గావ్ తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. గోవాలోని శిర్గావ్ లైరాయ్ దేవి ఆలయంలో జాతర కొనసాగుతుండగా తొక్కిసలాట జరిగి ఏడుగురు మృతి చెందారు. 60 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే.