మేదరమెట్లలో ఆటో డ్రైవర్లు నిరసన

BPT: కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలో సాయిబాబా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు తమపై న్యాయం చేయాలంటూ బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన తమకు బాడుగలు లేక తీవ్రంగా నష్టపోయామని అన్నారు.