VIDEO: గిద్దలూరులో విజయోత్సవ ర్యాలీ
ప్రకాశం: మార్కాపురం జిల్లా ప్రకటించిన సందర్భంగా గిద్దలూరులో భారీ ర్యాలీ మంగళవారం జరిగింది. కూటమి ప్రభుత్వం జిల్లాని ప్రకటించిన సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ.. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారని, పశ్చిమ ప్రాంత ప్రజలు సీఎంకి రుణపడి ఉంటామని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలియజేశారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు.