మేం స్వేచ్ఛగా ఆడాల్సిన సమయమిదే: కరుణ్ నాయర్

IPL 2025లో భాగంగా నేడు SRHతో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. అయితే, ఢిల్లీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే కనీసం రెండు మ్యాచుల్లో గెలవాలి. ఈ క్రమంలో తమ గేమ్ ప్లాన్‌పై DC బ్యాటర్ కరుణ్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సీజన్‌లో అన్ని మ్యాచుల్లో విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించినట్లు తెలిపాడు. ఇప్పుడు మరింత నిర్భయంగా, స్వేచ్ఛగా ఆడే సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు.