దారుణ హత్య.. తల, వేళ్లు వేరుచేసి..
TG: నిజామాబాద్(D) మిట్టాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్రామ శివారులో తల, చేతుల వేళ్లు లేకుండా వివస్త్రగా పడి ఉన్న మహిళ మృతదేహం కనిపించింది. స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలి వయసు 30-40 ఏళ్ల మధ్య ఉంటుందని, ఎక్కడో హత్యాచారం చేసి అక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.