పుణ్యక్షేత్రాలకు ఈనెల 30న ప్రత్యేక బస్సు

పుణ్యక్షేత్రాలకు ఈనెల 30న ప్రత్యేక బస్సు

నాగర్ కర్నూల్ డిపో నుంచి ప్రముఖ పుణ్య క్షేత్రాల సందర్శన కోసం సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ యాదయ్య శనివారం తెలిపారు. ఈనెల 30న రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరి అన్నవరం, ద్రాక్షారామం, భీమవరం, విజయవాడ కనకదుర్గ, మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలను సందర్శిస్తుందని చెప్పారు. పూర్తి వివరాలకు 94904 11591 నంబర్‌ను సంప్రదించాలన్నారు.