మున్సిపల్ కార్మికుల ధర్నా

KMR: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ తమకు సరైన సమయంలో వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులున్నారు.