మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య

ASF: మద్యానికి బానిసైన వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం రాత్రి ఆసిఫాబాద్‌లో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాలు.. రాజంపేటకి చెందిన నాగభూషణం (50) అనే వ్యక్తి గత కొన్ని ఏళ్ల నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.