ఖాళీల భర్తీ కొరకు ప్రభుత్వానికి నివేదిస్తాం

ఖాళీల భర్తీ కొరకు ప్రభుత్వానికి నివేదిస్తాం

ELR: పోలవరం తహసీల్దార్ కార్యాలయాన్ని జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఎంవీ.రమణ శనివారం సందర్శించి దస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. కార్యాలయంలో ఖాళీల భర్తీ కొరకు ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై దృష్టి సారించామని ఆర్డీవో తెలిపారు.