VIDEO: ప్రొద్దుటూరు‌లో అగ్నిప్రమాదం

VIDEO: ప్రొద్దుటూరు‌లో అగ్నిప్రమాదం

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్‌ ఆఫీస్‌ రోడ్డులో అగ్నిప్రమాదం జరిగింది. పాత సామాన్ల దుకాణంలో మంటలు  ఎగిసిపడుతున్నాయి. పరిసర ప్రాంతాల్లో పొగ  దట్టంగా అలుముకున్నది. దీంతో స్థానికులు భయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.