'కొబ్బరి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది'
ELR: కొబ్బరి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో కేర సురక్ష ఇన్సూరెన్స్ పథకం 2026-27 కొబ్బరి కార్మికుల సామాజిక భద్రత" కరపత్రాలను ఆవిష్కరించారు. అతి తక్కువ ప్రీమియంతో రూ. 7 లక్షలు ప్రమాద భీమా రక్షణ కల్పించబడుతోందని, అర్హులైనవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.