పెట్రోల్ ఎగుమతులపై రష్యా నిషేధం
ప్రపంచ ఇంధన మార్కెట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రష్యా ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్ ఎగుమతులపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధిస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్న నేపథ్యంలో.. తమ దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు రష్యా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.