VIDEO: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
NRML: సోన్ మండలం కడ్తాల్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శాంతినగర్‌కు చెందిన సాయిచరణ్(24) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై నిర్మల్ వెళ్తుండగా పెట్రోల్‌బంక్ వద్ద రోడ్డు దాటుతున్న హబీబ్‌ను ఢీకొట్టి బైక్ డివైడర్‌కి ఢీకొంది.ఘటనలో హబీబ్‌తో పాటు మరో యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.