VIDEO: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిన శ్రేణులు

KMM: ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆదివారం ఖమ్మం ఎనిమిదో డివిజన్ నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలి వెళ్ళారు. ముందుగా డివిజన్ లో బీఆర్ఎస్ స్తూపాన్ని ఏర్పాటు చేసి గులాబీ జెండాను ఎగురవేశారు. ఈ సభ చరిత్రలో నిలిచిపోతుందని నగర యువజన విభాగం అధ్యక్షుడు దేవభక్తుని కిషోర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో వాంకుడోత్ సురేష్, వీరేంద్ర గౌడ్ ఉన్నారు.